న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బ వరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరి స్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో, హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయ మవుతున్నారు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొం దుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్‌ను ఈనెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు నటించిన ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనర్ – విశాల్య, ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్, డీవోపీ – అక్షరు రామ్ పొదిశెట్టి, మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన, సీఈవో – రహస్య కిరణ్, ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం, రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు.
భిన్న నేపథ్య కథ..
- Advertisement -
- Advertisement -



