- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈసారి 30 శకటాలు ప్రదర్శించబడతాయి. ఇందులో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 13 కేంద్ర శాఖల శకటాలు ఉంటాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన శకటాలకు ఈసారి అవకాశం దక్కలేదు. కేవలం ఎంపిక ప్రక్రియ మాత్రమే కాకుండా, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన రొటేషన్ పాలసీ కూడా దీనికి కారణమని తెలుస్తోంది. 2024, 2025, 2026 సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కనీసం ఒక్క అవకాశం అయినా లభించేలా ఈ పాలసీ రూపొందించబడింది.
- Advertisement -



