కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో ఘటన
నవతెలంగాణ- కూసుమంచి
పెన్సిల్ గొంతులో దిగి విద్యార్థి మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడారపు విహార్(6) నాయకన్ గూడెంలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటర్వెల్ సమయంలో తోటి పిల్లలతో ఆడుతూ ఉండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఆ సమయంలో తన జేబులో ఉన్న పెన్సిల్ గొంతులోకి దిగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో విహార్‌ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బాలుడు మృతితో విద్యార్థి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పెన్సిల్ గొంతులో దిగి విద్యార్థి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



