Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేజీబీవీలో విద్యార్థిని మృతి

కేజీబీవీలో విద్యార్థిని మృతి

- Advertisement -

ఆడుతూ స్పృహ కోల్పోయిన హర్షిత
ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు ధ్రువీకరించిన వైద్యులు
సిద్దిపేట జిల్లా మిట్టపల్లి కేజీబీవీలో ఘటన


నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్‌
స్కూల్‌లో ఆడుకుంటూ స్పృహ కోల్పోయి ప్రమాదవశాత్తు విద్యార్థిని మృతిచెందిన సంఘ టన సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సమీపంలోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి జరిగింది. సిద్దిపేట త్రీ టౌన్‌ సీఐ విద్యాసాగర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామా నికి చెందిన గుర్రం తిరుపతిరెడ్డి, శ్రావణి దంప తుల ఇద్దరు కుమార్తెలు.. మిట్టపల్లి సమీపంలోని కేజీబీవీలో చదువుకుం టున్నారు. పెద్దమ్మాయి వర్ష 9వ తరగతి చదువుతుండగా, చిన్న కూతురు హర్షిత (11) ఏడవ తరగతి చదువుతోంది. కాగా, హర్షిత శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత తోటి విద్యార్ధులతో కలిసి ఆడుకుంటుంది.

ఈ క్రమంలో ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ప్రాథమిక చికిత్స నిర్వహించి అంబులెన్స్‌కు సమాచారం అందించి సమీపంలోని సురభి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు హర్షితను పరీక్షించి మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని హర్షిత అక్క వర్ష, ఉపాధ్యాయులు.. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే హర్షిత మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తండ్రి తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సిఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -