Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్క్రీడల్లో దూసుకుపోతున్న విద్యార్థిని

క్రీడల్లో దూసుకుపోతున్న విద్యార్థిని

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన మంగలి అఖిల అదే గ్రామానికి చెందిన  విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి సహకారంతో విద్యలోనూ క్రీడల్లోనూ రాణిస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖిల తండ్రి మంగళి నర్సింలు, తల్లి శ్రీలతలు తమ కులవృత్తిని, బీడీలు  చేసుకుంటూ కూతురిని చదివిస్తున్న క్రమంలో వారికి ఆర్థిక భారం కలగడంతో ఆదే గ్రామానికి చెందిన పదిమందికి మంచి చేయాలనే ఆలోచన కలిగిన సుభాష్ రెడ్డిని సంప్రదించడంతో ఆయన తన సొంత ఖర్చులతో చదువుకు ఇటు క్రీడల్లో పాల్గొనేందుకు సైతం ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రస్తుతం మంగలి అఖిల హైదరాబాద్ బేగంపేట్ లోని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో బీఎస్సీ, ఎం ఎస్ డి ఎస్ చివరి సంవత్సరం చదువుకుంటుంది. దీంతోపాటు క్రీడలు కబడ్డీ, టంగ్ ఆఫ్ వార్, టెన్ని కోయిట్ తదితర క్రీడల్లో చురుకుగా పాల్గొంటూ ఎన్నో ప్రశంస పత్రాలను, మోడల్ లను ఆమె సొంత చేసుకుంది. ఈమధ్య పంజాబ్ లో జరిగిన లామ్రిన్ టెక్ స్కిల్స్ యూనివర్శిటీ టగ్ ఆఫ్ వార్ నేషనల్స్ 9లో తన ప్రతిభని చాటి గోల్డ్ మెడల్ సాధించినట్లు గ్రామస్తులు తెలిపారు. జనగామ గ్రామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బీబీపట మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపీ కప్పిర రవీందర్ రెడ్డిలు అఖిలకు అన్ని విధాలుగాసహకారాలు అందిస్తున్న సుభాష్ రెడ్డిని అభినందించారు. అఖిల చదువులో, క్రీడల్లో జాతీయస్థాయిలో పాల్గొనాలని కోరుకుంటున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -