Tuesday, May 13, 2025
Homeజాతీయంఏపీ రాజధానికి భూముల్చిన రైతుల పేర్లతో స్తూపం నిర్మించాలి

ఏపీ రాజధానికి భూముల్చిన రైతుల పేర్లతో స్తూపం నిర్మించాలి

- Advertisement -

అమరావతి. : ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి భూముల్చిటన రైతుల పేర్లతో అమరావతిలో స్తూపం నిర్మించాలని ప్రముఖ కవి నగముని ప్రభుత్వానికి సూచించారు. రాధాకృష్ణ కర్రి, అమూల్య చందుల లైఫ్‌ డ్రామా, భమూ నవ్వడం చూశాను కవితా సంకలనాల పుస్తకాలను బాలోత్సవ్‌ భవనంలో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. నగముని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ కాస్త ఆంధ్ర..తెలంగాణగా విడిపోయినందుకు తెలంగాణ రాష్ట్రం అని పేరు పెట్టుకున్నారని, మనం ఆంధ్ర రాష్ట్రం లేదా నవ్యాంధ్ర రాష్ట్రంగా పిలుచుకోవాలని సూచించారు.పుస్తక కవయిత్రుల కవిత్వం దిగంబర ఉద్యమానికి కోనసాగిపు అన్నారు. విరసం ఆవిర్భావం తర్వాత కవిత్వంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయని, అందులో బాగంగా దళిత, మైనార్టీ, మహిళా ఉద్యమాల ప్రభావంతో మంచి కవిత్వం వచ్చిందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన వక్కలంక సీతారామారావు( వసీరా) మాట్లాడుతూ అమూల్య చందు కవిత్వంలో ఆవేశం ఉన్నదని, రాధాకృష్ణ కవిత్వంలో ఆలోచన ఉన్నదని వివరించారు. ఇద్దరి కవితలను చదివి వినిపించారు. కథకుడు ముక్కామల చక్రధర్‌ అద్యక్షత వహించగా సుధా మురళి,శాంతి శ్రీ, వాణి శ్రీ,నైనాల పాల్గోన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -