Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeకవితసూర్యుడు లేని ఉదయం

సూర్యుడు లేని ఉదయం

- Advertisement -

అంతరిక్ష పుస్తకపు నక్షత్రాల
నాట్యపుతాళాలన్ని కలిసి కలాం
ముఖచిత్రమై కనిపిస్తున్న ఈవేళ..
ఆకాశం నాదేశపు శాస్త్ర సాంకేతిక
సంగీతపు విజయగీతంతో ప్రపంచం
గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది..!
రామేశ్వరం వీధుల చెంతన
రాకెట్ల మోత ”అగ్ని”పథపు
పరావర్తనమై మన ప్రగతి
అద్దంలో ప్రతిబింబిస్తుంటే..
పేదరికపు సమరంలో
అపజయాలన్నీ అదిరిపోయి
భారతరత్న వెన్నెల వెలుగుల
మధ్య ఓ స్ఫూర్తి ధవతార
చిరునవ్వుల సంబరమై విరబూసింది..!
వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ ఆలోచనల
వరద అక్షర దిక్సూచై నవతరానికి
బ్రతుకు గెలుపు మార్గం చూపెడుతుంటే..
కలాం ఆశల కలం
భారతజాతి ప్రేరణ శిఖరమై
మతసామరస్యపు సందేశం
మానవత్వపు సిగల్స్‌ చూపెడుతుంది..!
కాలం కరిగిపోయి కొవ్వొత్తి లా
మారి కలాం జీవన గమనానికి
సెల్యూట్‌ చేస్తూ..
నా త్రివర్ణ పతాకపు నేత్రంలో
జనగణమన పాడుతుంటే
తూర్పు సందుల్లో సూర్యుడు కాదు..!
నేడు అబ్దుల్‌ కలాం ఉదయించారు..!!
– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad