Wednesday, October 15, 2025
E-PAPER
Homeసినిమాపక్కా పైసా వసూల్‌ సినిమా

పక్కా పైసా వసూల్‌ సినిమా

- Advertisement -

బీవీ వర్క్స్‌ బ్యానర్‌ మీద బన్నీ వాస్‌ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్‌ మీద కళ్యాణ్‌ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’.
ప్రియదర్శి, నిహారిక ఎన్‌ ఎం హీరో హీరోయిన్లు. విజయేందర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈనెల 16న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్‌ ఘనంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో ప్రియదర్శి మాట్లాడుతూ, ‘ఈ సినిమా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ చూశాను. ఈ చిత్రం మీకు నచ్చకపోతే.. నెక్ట్స్‌ వచ్చే నా ఏ సినిమాని కూడా చూడకండి. ఈ సినిమాతో దీపావళిని మేం మీ కోసం ముందుగానే తీసుకు వస్తున్నాం’ అని తెలిపారు.

‘దీపావళికి ఫ్యామిలీని నవ్వించే క్లీన్‌ ఎంటర్టైనర్‌. అందరినీ హాయిగా నవ్వించే మా సినిమాను ఈనెల 16న రిలీజ్‌ చేస్తున్నాం’ అని బన్నీ వాస్‌ చెప్పారు. నిహారిక ఎన్‌ ఎం మాట్లాడుతూ ‘మా సినిమాని అందరూ చూసి హిట్‌ చేయండి’ అని అన్నారు. ‘నా జర్నీలో సపోర్ట్‌ చేసిన బన్నీ వాస్‌, నిర్మాతలకు థాంక్స్‌. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్‌ చేయండి’ అని డైరెక్టర్‌ విజయేందర్‌ తెలిపారు. నిర్మాత భాను ప్రతాప మాట్లాడుతూ, ‘ఈనెల 15న మేం ప్రీమియర్లు వేస్తున్నాం. మా కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో చాలా సపోర్ట్‌ చేస్తున్నారు. హేటర్స్‌ వల్లే మేం మరింతగా ముందుకు వెళ్తున్నాం. మా చిత్రం చూడటానికి వచ్చిన ప్రతీ ఒక్కరినీ నవ్విస్తాం’ అని చెప్పారు. మరో నిర్మాత డా. విజేందర్‌ రెడ్డి తీగల మాట్లాడుతూ, ”హాయ్‌ నాన్న’ తరువాత మళ్లీ ప్రియదర్శితో కలిసి పని చేస్తున్నాను. ఇది కచ్చితంగా పైసా వసూల్‌ చిత్రం అవుతుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -