రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెరంగేట్రం చేస్తూ నటించిన చిత్రం ‘జూనియర్’. రాధా కష్ణ దర్శకుడు శ్రీశీలీల హీరోయిన్‌గా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ,’నిర్మాత సాయి ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మంచి కథతో ఒక చిన్న సినిమా చేస్తున్నారని అనుకున్నాను. కానీ చాలా పెద్ద సినిమా చేశారు. దేవి ఎప్పుడు కూడా తన మ్యూజిక్‌తో సినిమాని ఎలివేట్ చేస్తాడు. ‘వైరల్ వయ్యారి’ ఎంత వైరల్ అయిందో మళ్లీ దాని గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయించిన సాంగ్ అది. పీటర్, సెంథిల్ ఇద్దరు కలిసి ఒక అబ్బాయి బాగా చేస్తున్నాడని చెబుతున్నారంటే కిరీటీకి అంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఫిల్మ్ ఇండిస్టీలో ఉండదు. ఈ సినిమా కిరీటీని తప్పకుండా పెద్ద స్థాయికి వెళుతుంది. శ్రీలీల అద్భుతమైన డాన్సర్. దర్శకుడు రాధాకష్ణ మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డారు. ఇది పక్కా పైసా వసూల్ సినిమా’ అని అన్నారు.
పక్కా పైసా వసూల్ సినిమా : రాజమౌళి
- Advertisement -
- Advertisement -