– ఇంచార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యలతో భేటీ
– సీఎం ప్రజావాణి సమస్యల పరిష్కార వేదిక
– ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం
– మధ్యప్రదేశ్ డిప్యుటీ కలెక్టర్స్
నవతెలంగాణ హైదరాబాద్: జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రజావాణి, ప్రవాసి ప్రజావాణిని మధ్యప్రదేశ్ రాష్ట్ర డిప్యుటీ కలెక్టర్స్ బృందం సందర్శించింది. సీఎం ప్రజావాణి, ప్రవాసి ప్రజావాణి పని తీరు చాలా బాగుందని, ఇలాంటి విధానాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తమ రాష్ట్ర ఉన్నత అధికారులకు సిఫార్సు చెస్తామని డిప్యూటీ కలెక్టర్లు తెలిపారు. ఈ సందర్బంగా మధ్యప్రదేశ్ డిప్యుటీ కలెక్టర్లు సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లతో భేటీ అయ్యారు. సీఎం ప్రజావాణి గురించి వారు డిప్యూటీ కలెక్టర్లకు వివరించారు. సీఎం ప్రజావాణి సమస్యల పరిష్కార వేదిక అని, ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం అని మధ్యప్రదేశ్ డిప్యుటీ కలెక్టర్స్ పేర్కొన్నారు.