Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకన్నెగంటి రంగయ్యకు కన్నీటి వీడ్కోలు

కన్నెగంటి రంగయ్యకు కన్నీటి వీడ్కోలు

- Advertisement -

అమరుల త్యాగాలు వృథా కానివ్వం
పోరాట యోధుల స్ఫూర్తితో బలమైన పోరాటాలు
అంతిమ యాత్రలో పాడే మోసిన జూలకంటి

నవతెలంగాణ-మిర్యాలగూడ
పీడిత ప్రజల కోసం ఆనాడు చేసిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుల త్యాగాలు వృథా కానివ్వమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కన్నెకంటి రంగయ్య అంతిమ యాత్ర శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గారిపల్లి గ్రామంలో నిర్వహించారు. ముందుగా రంగయ్య భౌతికకాయంపై జూలకంటి ఎర్ర జెండా కప్పి నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. భూస్వాములు, రాజాకార్లు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పేదలపక్షాన పోరాటాలు సాగించా లని గుర్తుచేశారు. చిన్నప్పటి నుంచి ఎర్రజెండా చేతపట్టి ఉద్యమాల్లో దళ కమాండర్‌గా పని చేశారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల జరిగిన పోరాటాల్లో కన్నెకంటి రంగయ్య ప్రత్యక్షంగా పాల్గొని పేదల సమస్యలు పరిష్క రించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అజ్ఞాతం, జైలు జీవితాలను గడిపి, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని ప్రజల పక్షాన పోరాటాలు చేశారన్నారు. ఎర్రజెండా ద్వారానే సమ సమాజ స్థాపన జరుగుతుందని, ప్రపంచానికి ఎర్రజెండే ప్రత్యామ్నాయమని అన్నారు. రంగయ్య చూపిన మార్గంలో భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. రంగయ్య ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్తా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, అంత్యక్రియల్లో రంగయ్య పాడెను జూలకంటి రంగారెడ్డితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మోశారు. ఆ పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సంతాపం ప్రకటించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -