Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeసినిమాప్రపంచానికి వినిపించాల్సిన తెలుగు కథ

ప్రపంచానికి వినిపించాల్సిన తెలుగు కథ

- Advertisement -

డైరెక్టర్‌ వెంకటేష్‌ మహా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రావు బహదూర్‌’ చిత్రాన్ని జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేతలు మహేష్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌ సమర్పిస్తున్నారు.
సత్య దేవ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏ+ఎస్‌ మూవీస్‌, శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్నాయి. ఇదొక సైకలాజికల్‌ డ్రామా. ఓ రాజవంశం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, ఎడిటింగ్‌ వెంకటేష్‌ మహా నిర్వర్తిస్తున్నారు. గొప్ప విజువల్స్‌, భావోద్వేగాలు, చరిత్ర-సంస్కతి కలిపిన ప్రపంచాన్ని చూపించబోతున్నారు. తెలుగు కథ గ్లోబల్‌ ఆడియెన్స్‌ కోసం రెడీ అవుతోంది.
తాజాగా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో సత్యదేవ్‌ను అరిస్టోక్రాటిక్‌ డ్రెస్‌లో, చుట్టూ నెమలి పించాలు, తీగలు, చిన్న, చిన్న బొమ్మల మధ్య కనిపించడం చాలా క్యురియాసిటీని పెంచింది. ఈనెల 15న థియేటర్స్‌లో ‘నాట్‌ ఈవెన్‌ ఎ టీజర్‌’ అనే స్పెషల్‌ వీడియో రిలీజ్‌ అవుతుంది. ఆ తర్వాత ఈనెల 18న డిజిటల్‌లో వస్తుంది అని మేకర్స్‌ తెలిపారు.
‘ఇది ప్రపంచానికి వినిపించాల్సిన తెలుగు కథ’ అని దర్శకుడు వెంకటేష్‌ మహా చెప్పారు. సత్యదేవ్‌ మాట్లాడుతూ, ‘ఒక యాక్టర్‌గా ఇలాంటి సినిమా దొరకడం అరుదు. నేను కేవలం నటించలేదు, నిజంగానే రావు బహదూర్‌గా బతికాను’ అని తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో తెలుగుతోపాటు మరిన్ని భాషల్లో (సబ్‌టైటిల్స్‌తో) రిలీజ్‌ చేయనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img