నవతెలంగాణ – ఆర్మూర్
శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం ( కుక్కల గుట్ట )లో వైకుంఠ ( ముక్కోటి ) ఏకాదశి రేపు అంగరంగ వైభవంగా నిర్వహించబడునని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుడు సోమవారం తెలిపారు. ఉదయం 4 గంటల నుండి మొదలుకొని గుడి చుట్టూ ఉత్సవ మూర్తులతో పల్లకి సేవ అనంతరం ఉత్తర ద్వారా ప్రవేశం, స్వామి వారికి అభిషేకం, సత్యనారాయణ పూజ మిగితా పూజ కార్యక్రమాలు జరుగును కావున వచ్చే భక్తులకు ఉత్తర ద్వారా గుండా ప్రవేశించి స్వామి వారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా గ్రామ అభివృద్ధి కమిటీ ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, భక్తులు క్యూ పద్ధతిని పాటించి స్వామి వారి దర్శనం చేసుకోగలరని కోరారు.
ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన ఆలయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



