రైలుపై జారిపడిన క్రేన్
పట్టాలు తప్పిన బోగీలు
32 మంది మృతి
60 మందికి పైగా గాయాలు
కొనసాగుతున్న సహాయక చర్యలు
ట్రైన్ బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాచథని ప్రావిన్స్‌కు వెళ్తుండగా ఘటన
బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారిపడటంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 32 మంది మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయపడినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం… సిఖియో జిల్లాలో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల్లో ఉన్న ఓ క్రేన్ అదుపుతప్పి ఒక్కసారిగా పట్టాలపై నుంచి వెళ్తున్న ఓ ప్రయాణికుల రైలుపై పడింది. దీంతో ఆ రైలు బోగీలు పట్టాలు తప్పి మంటలు చెలరేగాయి. ఈ సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసినట్టు తెలిపారు. ఈ రైలు బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాచథని ప్రావిన్స్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో రైలులో 195 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. రైలుకు మొత్తం మూడు బోగీలు ఉండగా… చివరి రెండు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



