Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాయి లిఖిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి: పీడీఎస్ యూ

సాయి లిఖిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి: పీడీఎస్ యూ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
మెండోరా మండలం పోచంపేట్ గ్రామంలో బాలికల రెసిడెన్షియల్ లో చదువుతున్న 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత మరణంపై సమగ్ర విచారణ జరపాలని పిడిఎస్యు  ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా కు శుక్రవారం వినతి పత్రం అందజేసినారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు ఎం. నరేందర్, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. విద్యార్థి సాయి లిఖిత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా.. అక్కడ ఉన్న ఏఎన్ఎం ఇన్చార్జి ప్రిన్సిపల్ సిబ్బంది ఆ విద్యార్థిని పట్టించుకోలేదని అన్నారు. ఈ క్రమంలో విద్యార్థిని వాంతింగ్ చేసుకుందని, దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి, మళ్లీ తీసుకువచ్చినా తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు.

మరుసటి రోజున ఆ అమ్మాయి తీవ్ర అనారోగ్యానికి గురైతే అప్పుడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళారని తెలిపారు. అక్కడి నుండి నిర్మల్ లోని స్వప్న సూపర్ స్పెషాలిటీ కు డాక్టర్లు అమ్మాయికి డెంగ్యూ అని రిపోర్ట్ ఇచ్చారని, అక్కడి నుండి హైదరాబాద్ మీలోఫర్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. అక్కడ  వైద్యం అందిస్తున్న అమ్మాయి 17న ఉదయం 7:20 చనిపోయింది అని వైద్యులు వెల్లడించారు. అమ్మాయి బాడీని  పాఠశాల దగ్గరకి తీసుకొచ్చిన్న కనీసం అమ్మాయి చూడాలని వారు అన్నారు. దీనికి సంబంధించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే అమ్మాయి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, అమ్మాయి కుటుంబంలో ఒకరికి అర్హతకు తగ్గట్టు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, సాయి లిఖిత వాళ్ళ అన్న ఆయన ఇంతవరకు చదువుకుంటే అంతవరకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్  ఏరియా అధ్యక్ష కార్యదర్శులు నిఖిల్ రాజు , విద్యార్థి తల్లిదండ్రులు లింగన్న లక్ష్మి , మామయ్య సాయినాథ్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -