Monday, July 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థిని సంధ్య మృతిపై సమగ్ర విచారణ జరపాలి...

విద్యార్థిని సంధ్య మృతిపై సమగ్ర విచారణ జరపాలి…

- Advertisement -

పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి…
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు..
జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలలో సంధ్య అనే విద్యార్థి మృతి చెందడంపై మృతి పట్ల సమగ్ర విద్య జరపాలని, పాఠశాల ప్రిన్సిపాల్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని సంధ్య కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్ అన్నారు. సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు  కలెక్టర్ భాస్కర్ రావు కి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ మండలంలోని తూప్రాంపేట గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సంధ్య అనే విద్యార్థి పాఠశాల భవనంపై దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

విద్యార్థి మృతిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని విద్యార్థులకు బిల్డింగ్ ఎక్కుతుంటే పాఠశాల వార్డెన్,వాచ్మెన్ పైన ఏం చేస్తున్నారని ప్రశ్నించడం జరుగుతుందని, సంధ్యా కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్క్యూటివ్ ఎక్స్గ్రేషియో, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, మృతి పై సమగ్ర విచారణ జరపాలని అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ హాస్టల్ వార్డులపై చర్యలు తీసుకోవాలని స్థానికంగా పాఠశాలలో హాస్టల్లోవార్డెన్ ఉండకుండా కాలయాపన చేస్తున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి, విద్యార్థి మృతి పైన సమగ్రమైన విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -