Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుమ్మెర ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలి

కుమ్మెర ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలి

- Advertisement -

– పాప మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి : డీజీపీకి మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర జాతరలో అమానుష ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డిని శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు కిషోర్‌గౌడ్‌, ఉపేందర్‌ చారి, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, బీఆర్‌ఎస్‌ నేతలు స్వామి యాదవ్‌, రాజు తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకులానికి చెందిన నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల పసికందును తన్నడంతో చనిపోయారని అన్నారు. పాపను చంపిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు వెలికితీయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -