అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి నెట్‌ఫ్లిక్స్ ‘ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్’ అనే ఓ సరికొత్త తమిళ థ్రిల్లర్‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో శ్రద్ధ శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మేకర్స్ గురువారం ట్రైలర్‌ని విడుదల చేశారు. సిరీస్ అక్టోబర్ 2న స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. నిజానికి ఫన్ కోసం ఆటలు ఆడాలి. కానీ అదే ఆట ఆడుతుంటే నిజజీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు సరికొత్త తమిళ థ్రిల్లర్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. వర్చువల్ గేమ్ ఆడుతున్నప్పుడు నిజ జీవితంలో దానివల్ల సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా ఈ థ్రిల్లర్ ట్రైలర్ కనిపిస్తోంది. అక్టోబర్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే ఎన్నో సీక్రెట్స్ మరెన్నో మాస్కులు ఆవిష్కతం కాబోతున్నట్టు కనిపిస్తోంది. దర్శకుడు రాజేష్ ఎం. సెల్వా మాట్లాడుతూ, ‘ఈ సిరీస్‌తో మేం సష్టించే ప్రపంచాలు, మనం జీవించే జీవితాల మధ్య సున్నితమైన గీతను అన్వేషించాలనుకున్నాను.
సిరీస్ ఫ్యామిలీ డ్రామా, కాంప్లికేటెడ్ రిలేషన్స్ తో కూడిన ఓ థ్రిల్లర్. హైపర్-కనెక్టెడ్ యుగంలో ఏదీ కేవలం వర్చువల్‌గా మిగలదు. తెరపై జరిగే విషయం వాస్తవంలోకి చొచ్చుకొస్తుంది, నియంత్రించలేని పరిణామాలతో. ప్రతి మాస్క్ వెనుక ఒక సత్యం దాగి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌తో నా మొదటి తమిళ ఒరిజినల్‌గా నా విజన్ జీవం పోసుకోవడం అత్యంత ఆనందకరమైన అనుభవం’ అని అన్నారు. ‘స్వతంత్ర మహిళగా, అదే సమయంలో గేమింగ్ డెవలపర్‌గా ఉన్న పాత్రలోకి అడుగుపెట్టడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. నా పాత్ర సష్టించిన ప్రపంచమే ఆమెకు వ్యతిరేకంగా మారి, ఆమె తప్పించుకోలేని భయంకరమైన వాస్తవంగా మారిన థ్రిల్లర్ జోన్‌లోకి ప్రవేశించడం సవాలుగా అనిపించింది. రాజేష్‌తో కలిసి పనిచేయడం ఈ ప్రయాణాన్ని మరపురానిదిగా చేసింది. నెట్‌ఫ్లిక్స్‌తో ఈ కథకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అను సంధానం కావాలని ఆశిస్తున్నాం. ఇది తప్పకుండా మీకు ఆద్యంతం థ్రిల్ ఇస్తుంది’ అని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పారు.
ఆద్యంతం థ్రిల్ చేసే సిరీస్
- Advertisement -
- Advertisement -