- Advertisement -
నవతెలంగాణ- నవీపేట్: కల్లు డిపో నుండి కల్లు బట్టికి కల్తీ కళ్ళు తరలిస్తున్న వాహనం టైరు పేలి బోల్తాపడగా ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన నవీపేట్ మండలంలోని యంచ శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బొలెరో వాహనం TS 16 UA 7408 లో ఓ కల్లు డిపో నుండి యంచ గ్రామ కల్లు బట్టికి కల్తీ కల్లు తరలిస్తుండగా మార్గ మధ్యలో వాహనం టైరు పేలి బోల్తా పడింది. రోడ్డంతా కల్లు సీసాలు పగిలి చెల్లాచెదురయ్యాయి. గమనించిన స్థానికులు గాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -