- Advertisement -
నవతెలంగాణ-మోటకొండూరు
ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి మోకుజారి కిందపడి గీత కార్మికుడు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం దిలావర్‌పూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు సీస పాండరి(53) రోజుమాదిరిగా ఆదివారం ఉదయం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారి తాటిచెట్టు పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, మృతుడు పాండరి కుటుంబ సభ్యులను కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు పరామర్శించారు. మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -



