కిలో ధర రూ.2.51 లక్షలకు చేరిక
మరింత పెరగొచ్చని నిపుణుల అంచనా
హైదరాబాద్ : పేదలు, సామన్యులకు ఇంత కాలం అందుబాటులో ఉన్న వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుల కొనలేని స్థాయికి ఎగబాకుతోంది. శనివారం కిలో వెండి ధర రూ.2.50 లక్షల ఎగువకు చేరింది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం.. కిలో వెండిపై రూ.11 పెరిగి రూ.2.51 లక్షలకు చేరింది. దీంతో 10 గ్రాములు లేదా తులం వెండి ధర రూ.2,510కి చేరినట్లయ్యింది. నెల రోజుల్లోనే కిలో వెండిపై దాదాపు రూ.80,000 పైగా పెరగడం గమనార్హం. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.1,200 పెరిగి రూ.1,41,370కి చేరింది.
22 క్యారెట్ల పసిడి రూ.1100 ప్రియమై రూ.1,29,600గా పలికింది.అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో తదుపరి సమీక్షలోనూ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు పెరిగిపోవడం, ఆర్థిక అనిశ్చితులు తొలగకపోవడంతో, పసిడి, వెండిలో పెట్టుబడులు సురక్షితం అనే భావనలు ఈ లోహాల ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి. గిరాకీకి తగ్గట్లు వెండి సరఫరా లేదని, అందువల్ల ధరలు పెరుగుతాయనే అంచనాలతో కొనుగోళ్లు పెరిగాయి. వచ్చే ఏడాది 2026లో వెండి ధర ప్రస్తుత స్థాయి నుంచి మరో 18 శాతం పెరగొచ్చని సీఆర్ఎం కమోడిటీ అండ్ సీఆర్ఎం హెడ్ ఎన్ఎస్ రామస్వామి అంచనా వేశారు.
తులం వెండి రూ.2500 పైనే..
- Advertisement -
- Advertisement -



