యాక్సిస్ సెక్యూరిటీ అంచనా
న్యూఢిల్లీ : వెండి ధరలు ఇప్పటికే భగ్గుమంటోన్న వేళ మరింత పెరగొచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2 లక్షలు దాటింది. ఇది మరింత పెరగొచ్చని బ్రోకరేజి సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో వెల్లడించింది. స్వల్పకాలిక దిద్దుబాట్లను కొనుగోలు అవకాశంగా మలుచుకోవచ్చని సూచించింది. 2026 ముగింపు నాటికి వెండి ధర కిలోకు ఏకంగా రూ.2.4 లక్షల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. అంటే 10 గ్రాములు లేదా తులం ధర రూ.2,400కు చేరనుంది. అంతర్జాతీయ మార్కెట్లో 50 డాలర్ల నుంచి 64 డాలర్ల కొత్త గరిష్ఠానికి చేరుకుందని తెలిపింది. పారిశ్రామిక డిమాండ్ పెరగడం.. మరీ ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ వృద్ధి వెండి ధరలకు ఆజ్యం పోస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
తులం వెండిరూ.2400కు చేరొచ్చు
- Advertisement -
- Advertisement -



