కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు…బోలగాని జయరాములు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జిల్లాలోని గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో తాటి ఈత ఉత్పత్తుల శిక్షణ కేంద్రాన్ని పేట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించి శంకుస్థాపన చేసిన శిక్షణ కేంద్రంను వెంటనే ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కల్లుగీత కార్మిక సంఘం తరఫున కోరుతున్నామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు అన్నారు. బుధవారం రోజున భువనగిరి పట్టణంలోని స్థానిక వైయస్సార్ ఫంక్షన్ హాల్లో కల్లు గీత కార్మిక సంఘం భువనగిరి మండల 10 వ మహాసభ సంఘం మండల అధ్యక్షులు పాండాల మైసయ్య అధ్యక్షతన నిర్వహించగా, ముఖ్యఅతిథిగా జయరాములు హాజరై, మాట్లాడారు.
యిన్ని సంవత్సరాలు గడిచిన ప్రభుత్వాలు మారుతున్న కల్లుగీత కార్మిక సంఘం. గీత కార్మికుల ఆందోళనల ఫలితంగా ఇటీవల దిగిపోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం శిక్షణ కేంద్రానికి ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించి, భవన నిర్మాణలు యంత్రాలు అన్ని సమకూర్చడం జరిగింది. కానీ చిన్న చిన్న పనులను పూర్తి చేసి దానిని వెంటనే ప్రారంభించాల్సిన ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలకు దగ్గర వచ్చిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కల్లుగీత కార్మికుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని అన్నారు. ఇప్పటికైనా భువనగిరి జిల్లాలో గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీత కార్మిక కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, వారి కుటుంబాల ఉపాధి అవకాశాల కోసం తక్షణమే తాటి ఉత్పత్తుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి ఈ ప్రాంత గీత కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు.
ఈ మహాసభలో పాల్గొన్న సంఘం జిల్లా అధ్యక్షులు రాగీర్ కృష్ణయ్య మాట్లాడుతూ జిల్లాలో వృత్తిపై ఆధారపడి చూసినవారు అధికారిక లెక్కల ప్రకారం 15000 మంది గీత కార్మికులు ఉన్నారని అన్నారు. ఈ జిల్లాలో వృత్తిలో ప్రమాదాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయని గడిచిన సంవత్సరం ప్రమాదవశాత్తు తాటిచెట్ల పై నుండి కింద పడి గాయపడి మరణించిన వారి సంఖ్య 100కు పైగా ఉన్నదని ప్రభుత్వాలు గీత కార్మికుల ప్రమాదాలను వృత్తిలో తగ్గించడం కోసం ఇస్తామన్న కాటమయ్య రక్షణ కవచంలను ఇప్పటివరకు 600 మందికి మాత్రమే ఇచ్చారని మిగతా 14 వేల పైగా ఉన్న గీత కార్మికులకు ప్రభుత్వం తక్షణమే అందించాలని కోరారు. అదేవిధంగా గీత కార్మికులకు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా 10 లక్షల రూపాయలకు పెంచాలని జిల్లాలో పెండింగ్ లో ఉన్న 100 మంది గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియా లకు రెండు కోట్ల 80 లక్షల రూపాయల నిధులు కేటాయించి బాధిత కుటుంబాలకు అందించాలని అన్నారు. గీత కార్మికుల పెన్షన్ రూ.4000 ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు అందించాలని, ప్రతి కార్మికుడికి మోటార్ సైకిల్ ఉచితంగా ఇవ్వాలని, ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలని కోరారు.
ఈ మహాసభలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారు మాటూరి బాలరాజు రాష్ట్ర సహాయ కార్యదర్శి బూడిద గోపి, జిల్లా సహాయ కార్యదర్శి దుపటి వెంకటేష్, సంఘం జిల్లా నాయకులు మట్ట బాలరాజు, కొండ అశోక్, రంగా కొండల్, గడ్డమీది సోములు, గోదా సాయిలు, మచ్చ భాస్కర్, గడ్డమీద చంద్రం, రాంపల్లి సోములు, దంతూరి వెంకటేష్, మచ్చ బాలకృష్ణ, బోయిని నరసింహ, భువనగిరి వెంకటేష్, ఋషి గంపల చంద్రమౌళి, రాగుల వెంకటేష్, గంధ మల్ల భాస్కర్, రాంపల్లి వెంకటేష్, ఎడ్ల రాంబాబు, మచ్చ బిక్షపతి, నల్ల మాస శివరాజు, నల్ల మాస కిష్టయ్య, నరసింహ, బాలరాజు, రంగస్వామి, అంతరి దానయ్య, నల్ల మాస ఇస్తారి, బింగి పాండు, కళ్లెం భూపాల్, జంగయ్య, సురవి చంద్రయ్య లు పాల్గొన్నారు.