Friday, October 3, 2025
E-PAPER
HomeNewsకామ్రేడ్ సీతారాం ఎచూరికి ఘన నివాళి

కామ్రేడ్ సీతారాం ఎచూరికి ఘన నివాళి

- Advertisement -

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు 
నవతెలంగాణ – నెల్లికుదురు

కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతిని ఘనంగా నిర్వహించినట్లు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు తెలిపారు. శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మాట్లాడుతూ ఢిల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా,కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలీట్ బ్యూరో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, పార్టీ  ప్రధాన కార్యదర్శిగా, దేశంలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మధ్య తరగతి ప్రజల తరపున అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించారు అని అన్నారు.  అంతర్జాతీయ కమ్యూనిస్టుల ఐక్యత కోసం కృషి చేసిన ఏచూరి గారి ఆశయాలు కొనసాగించడానికి మనందరం పని చేయడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పెరుమాండ్ల బాబుగౌడ్ .మచ్చ వెంకన్న ఐల్లెష్ నాగరాజు వెంకన్న నరేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -