- Advertisement -
నవతెలంగాణ-ఆమనగల్ 
ఆమనగల్ పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహ పాల్గొని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు జగన్, మానయ్య, నాయకులు ఖాదర్ ఖాద్రీ, శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ ఖాదర్, అలీమ్, కాలే మల్లయ్య, షాబుద్దీన్, వెంకటేష్, సురేష్ నాయక్,  శేఖర్, కుమార్ గౌడ్, సురేష్, నాజర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    