- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు మంగళవారం హైదరాబాదులోని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంటికి వెళ్లి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి సత్యనారాయణ రావు మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు చెరుకు లింగం గౌడ్, రైతు బంధు సమితి మండల మాజీ కన్వీనర్ బచ్చు రామకృష్ణ,మాజీ ఎంపీటీసీ సరిత నగేష్,రామిడి వెంకట రమణారెడ్డి,నరసింహ,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



