Saturday, September 13, 2025
E-PAPER
Homeజాతీయంసీతారాం ఏచూరికి ఘన నివాళి

సీతారాం ఏచూరికి ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తొలి వర్ధంతి సందర్భంగా శుక్రవారం నాడిక్కడ కేంద్ర కార్యాలయంలో ఆయనకు పార్టీ నేతలు నివాళులర్పించారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మాట్లాడుతూ శ్రామిక, అణగారిన వర్గాల పోరాటాలకు ఆయన జీవితాంతం అంకితభావంతో పని చేశారన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం పట్ల ఆయనకు అచంచలమైన నిబద్ధత ఉందని తెలిపారు. పార్టీ సీనియర్‌ నేతలు ప్రకాశ్‌కరత్‌, బృందా కరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు తపన్‌సేన్‌, విజూ కష్ణన్‌, కేంద్ర కమిటీ సభ్యులు విక్రమ్‌ సింగ్‌, జోగేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ(ఎం) నేతలు రామచంద్రన్‌ పిళ్లై, హన్నన్‌ మొల్లా, నీలోపాల్‌ బసు, అరుణ్‌ కుమార్‌, జాన్‌ బ్రిట్టాస్‌, శ్రీదీప్‌ భట్టాచార్య, ఢిల్లీలోని కేరళ ప్రత్యేక ప్రతినిధి కెవి థామస్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -