Thursday, January 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రముఖ కవి కే శివారెడ్డికి పరామర్శ

ప్రముఖ కవి కే శివారెడ్డికి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
ప్రముఖ కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కే శివారెడ్డిని గురువారం తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కవి రచయిత గఫూర్ శిక్షక్ గురువారం హైదరాబాదులోని శివారెడ్డి నివాసంలో శివారెడ్డిని కలిసి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన రచనలు యుద్ధగీతం,  ధైర్య కవచం  పుస్తకాలను అందించారు. 

ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత  కే శివారెడ్డి మాట్లాడుతూ..గఫూర్ శిక్షక్ రచనలు ఎంతో  స్ఫూర్తిని ఇస్తాయని, మంచి రచనలు చేస్తున్నాడని మంచి భవిష్యత్తు ఉన్నదని అద్భుతమైన సాహితి కార్యక్రమాలు కామారెడ్డిలో నిర్వహిస్తూ యువకులను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయమన్నారు. యుద్ధ గీతం దీర్ఘ కవిత పుస్తకంలో అనేక సమస్యలకు పరిష్కారం ఉన్నదని ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. 

ఈ సందర్భంగా గపూర్ శిక్షక్ మాట్లాడుతూ.. కామారెడ్డి తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పాత కవులను శివారెడ్డి  జ్ఞాపకం చేశారని అన్నారు. కవిత్వం సామాజిక సమస్యల పరిష్కారానికి మార్గం కావాలని, మనసు చలిస్తేనే మంచి కవిత్వం వస్తుందని తన సుదీర్ఘ సాహితీ ప్రయాణంలో ఎన్నో రచనలను చేశానని ప్రతి రచన నాకు కొత్త రచనకు ప్రేరణ ఇచ్చిందని ఆయన తెలిపారు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -