నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలో కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్‌కు సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు, జర్నలిస్టులు సహా అనేక మంది పార్టీ కేంద్ర కమిటీ కార్యాలయం, కేరళ హౌస్ వద్ద నివాళులర్పించారు. మంగళవారం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ కార్యాలయం లో చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి మంత్రి కౌన్సెలర్ షు గుహోల్, వీఎస్ చిత్రపటానికి పూలమాల వేశారు. పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు, తపన్ సేన్, ఆర్. అరుణ్ కుమార్, అమ్రా రామ్ (ఎంపీ), కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. మురళీధరన్, కేంద్ర కమిటీ సభ్యులు మహమ్మద్ యూసుఫ్ తరిగామి (ఎమ్మెల్యే), సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు, ఐద్వా కోశాధికారి ఎస్. పుణ్యవతి, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా, కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు హనన్ మొల్లా, ఎంపీ ఆర్. సచ్చిదానందం, ఎస్‌ఎఫ్‌ఐ నేత వీపీ సాను, సీతారాం ఏచూరి సతీమణి, జర్నలిస్ట్ సీమా చిష్టి, కేరళ హౌస్‌లో యూడీఎఫ్ ఎంపీలు ఎన్.కె ప్రేమచంద్రన్, డీన్ కురియాకోస్, బెన్నీ బెహన్నన్, షఫీ పరంబిల్ ఇతరులు పుష్పాంజలి ఘటించారు. సోపాన సంగీతకారుడు న్జెరలత్ హరిగోవిందన్ సంగీత ప్రదర్శనలతో వీఎస్‌కు నివాళులర్పించారు.
వీఎస్‌కు ఘన నివాళి
- Advertisement -
- Advertisement -