Thursday, May 8, 2025
Homeజాతీయం‘నా భర్తకు నిజమైన నివాళి’..

‘నా భర్తకు నిజమైన నివాళి’..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో పలు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్ వివాదరహిత సరిహద్దుల్లోకి భారత్ ఇంత లోతుగా వెళ్లి దాడులు చేయడం ఇదే తొలిసారి. ఈ పరిణామంపై పహల్గామ్ దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధాని నరేంద్ర మోడీకి, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో కాన్పూర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యాపారవేత్త శుభమ్ ద్వివేది ప్రాణాలు కోల్పోయారు. భారత ప్రతీకార చర్యపై ఆయన భార్య స్పందిస్తూ “నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మా కుటుంబం మొత్తానికి ఆయనపై పూర్తి నమ్మకం ఉంది. ఆయన (పాకిస్థాన్‌కు) బదులిచ్చిన తీరు మా నమ్మకాన్ని నిలబెట్టింది. ఇదే నా భర్తకు అసలైన నివాళి. నా భర్త ఆత్మ ఎక్కడున్నా ఈ రోజు శాంతితో ఉంటుంది” అని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -