Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీతారాం ఏచూరికి ఘన నివాళి

సీతారాం ఏచూరికి ఘన నివాళి

- Advertisement -

కల్లూరి మల్లేశం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

యుద్దాల పేరుతో అమెరికా అనేక దేశాలలో వైరం పెడుతూ ఆయుధాలను అమ్ముకుంటుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరు మల్లేష్ విమర్శించారు. శుక్రవారం రోజున సీపీఐ(ఎం) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య భవనంలో “సామ్రాజ్యవాదం ఎదురవుతున్న సవాళ్లు”అనే అంశంపై సెమినార్ సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ప్రపంచంలోని ప్రజల రక్త మాంసాలతో తమ ఖజానా నింపుకుంటుందని ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగిన అక్కడ అమెరికన్ కంపెనీల ఆయుధాల శబ్దం వినబడుతుందని, పాలస్తీనా ఇరాన్ ఇజ్రాయిల్ రష్యా యుక్రెయిన్ దేశాలలో అనేకమంది సాధారణ ప్రజలు సైనికులు మరణించడం దీనికి నిదర్శనం అన్నారు.

దీనికి అమెరికా సామ్రాజ్యవాదం ధోరణి కారణమని అన్నారు  భారతదేశంలో మతోన్మాద రాజకీయాలు ప్రజల మధ్య బిజెపి ప్రభుత్వం వైశ్యామ్యాలు నింపుతుందన్నారు. మోడీ ట్రంప్ విధించిన టారిఫ్లను ఎదిరించకపోవడం వల్ల భారతదేశంపై 50% టారిఫ్ ల వల్ల 2 లక్షల 60 వేల కోట్ల భారం దేశ ప్రజలపై పడుతుందని దీనివల్ల దేశ ఆర్థిక పురోగతి మందగించే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాద ధోరణికి తలొగ్గి లోపభూయిష్టమైన విదేశీ విధానం  వలన గడిచిన 11 సంవత్సరాలుగా దేశం అనేక రంగాల్లో అధోగతి పాలు అయిందని ఆయన అన్నారు. సామ్రాజ్యవాద ధోరణి తలకెక్కిన ట్రంప్ భారతదేశం పాకిస్తాన్ యుద్ధ సమయంలో కల్పించుకొని భారత దేశ సార్వభౌమాధికారాన్ని తక్కువ చేసే విధంగా తాను ఇరుదేశాలకు మధ్య సయోధ్యకు ప్రయత్నించినట్లు చెప్పుకొని పాకిస్తాన్ కు మాత్రం ఆయుధ సరఫరా తో పాటు డబ్బులు ఇచ్చి ఉసిగొలిపిన పద్ధతిని దేశ ప్రజలందరూ నివసించారు.

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హసీం మునీర్ ను వైట్ హౌస్ పిలిచి రాచమర్యాదలు చేయడం లో అమెరికా నిజస్వరూపం బయట పడిందని అన్నారు.కామ్రేడ్ సీతారాఏచూరి సామ్రాజ్యవాదం కు సంబంధించి అనేక సందర్భాలలో అమెరికా విధానాలను ఎండగడుతూ అమెరికా విష కౌగిలి నుండి భారత దేశం దూరంగా ఉండాలని అమెరికన్ సామ్రాజ్యవాదం తన మిత్రులను కబళించే విధంగా ఉంటుందని హెచ్చరించే వారని అమెరికన్ సామ్రాజ్యవాదానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటమే సీతారాం ఏచూరి కి నిజమైన నివాళి అని అన్నారు.

ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేష్,  సీపీఐ(ఎం) మండల నాయకులు మోరీగాడి రమేష్, జూకంటి పౌలు, నల్ల మాస తులసయ్య, వడ్డే మాను బాలరాజు, ఘనగాని మల్లేశం, పిక్క గణేష్, చౌడబోయిన యాదగిరి, మోరీ గాడి చంద్రశేఖర్, చేన్న రాజేష్, మొరిగాడి అజయ్, గ్యార భాస్కర్, గ్యార అశోక్ మొరిగాడి అశోక్, అంజయ్య యాసారపు ప్రసాద్, బర్ల సిద్ధులు, పారుపల్లి సత్తయ్య, గొడుగు దాసు, దండు ఐలయ్య ఎండి ఖలీల్, ఎండి మతిన్ ఘనగాని రాజు ఘనగాని కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -