Sunday, January 25, 2026
E-PAPER
Homeసోపతిఅసలైన సద్వు - పౌరుడు

అసలైన సద్వు – పౌరుడు

- Advertisement -

అబ్బో అబ్బో ఏందిరా అందరు అప్పుడే అచ్చి కూసుండ్రు, అచ్చి కూసున్నాడే కాదు పోస్టుకాలూ దీసి రాస్తున్నారు, సద్వు తున్నారు, బట్టి బద్ధుండ్రు పోస్టుకాలూ దీసి సద్వుతుండ్రు, నేన్‌ ఒచ్చి చనసేపయ మీకు సోయే లేదు, పదో కిలసొల్లత పేలారు మీర్గూడ మొదలెట్టిండ్రా. ఏంది రేపు గెండ దినమని తయ్యరున ఇస్పీచుల పాటల ఏందిర కమ్లేషు నీవు నాయకుల పేర్లన్నీ లిస్ట్‌ చేస్తానావా? కార్తీక నువ్‌ ఎం చేస్తున్నావ్‌? శతంత్రుడు శూరా కడ్నుండి ఎప్పుడెం జరగింది తారికులు రాస్కుంటునవా మంచిపనే లే గట్లఉండలే.
గాలికి ఒర్లడం కాదు గమ్మున ఎవరన్న అడిగిన దైర్నంగా జవాబు చెప్పే తీర్న ఉండలే. గి ఆరం అంతా గిత్వోంటి పన్లే చేసిండ్రు లే మొన్న సోమరం నాడు నాకైతే నవ్వొచ్చింది. సంతోషం అనిపించింది. అందరు పోస్టుకాలు పట్టుకొని తల ఒక్క దిక్కు కూసోని పద్యాలు బట్టిపట్ట వట్టిండ్రు ఏండ్రు అని అంటే గి దినము వేమన పుట్టిన దినమంతా పొద్దుగాల టీచర్‌ చెప్పింది. వేమన షెట్కంలా పద్యాలునేర్వాలనను.

షట్కం అంటే నుర్‌ అంట. ఇంకా ఏందీ కూడా ఉందొచంట అన్నీ ఒక్క తీరుతాయి నాల్లైన్లల్ల ఒక్క పదం అన్న అన్నిట్ల ఒక్కతీరుంటాడంట. మనం తెల్సుకునేట్వి గా శేథకంల దొర్కుతాయంట గి వేమన రాసిన శేత్కం అయితే ఒక లైన్‌ మొత్తం ఒకటే ఉన్నాట్టుగ కానొచ్చింది. షత్కం అంటే ఏంటి అన్నింటా చెప్పింది వేమన ఎట్ల పుట్టిండు ఎట్ల వెర్గిండు తోల్తా ఎట్లుండేటోడు అన్నీ చెప్పింది. వేమన పోస్టుకం కూడా సూపెట్టింది వేమన ఒక్కడే కాదు ఇస్వొంటి షట్కాల్‌ రాసినోల్లు శానా ఉన్నారు మన సెల్లబస్‌ లా ఆడాడు ఒస్తారు కదా గి దినము వేమండి కాబట్టి ఔబెడ్తునా అని సెప్పి.
పరీక్షల్లా మార్కుల కొరకు ముందు దినము బట్టి పట్టి ముక్కుకంటికొని బోయి ఆడ వదిలేయుడు కాదు ఎప్పటికి మరవకుంట అర్థం పరమార్థం అన్నీ తెల్సుకొని అప్పుడప్పుడు నోటికి పల్కాలే సమయం చెప్పినప్పుడల్ల ఎన్‌.నోటికి పల్కుతుండలే .

రాసినోళ్లు నానకి ఎం నేర్పుతునరో అవి నేర్సుకోవాలె గి దినము వేమన గుర్తుగా అయిది పద్యలన్న నేర్వుండ్రి ఒచే ఏడు గి దినము నాటికి షట్కం మోతంకి నర్సి ఇన్పించినోళ్ళకి ప్రీగే ఉంటాది సూస్కొండి ప్రిగే కోర్కు కాదు షట్కం మొత్తం ల గవిటి అర్ధం తెల్సి నడ్డికుంటుంటే మన బాత్కు అక్కడ మారిపోతది షట్కాలు అంటే మజాకులు కాదు అని జెప్తే ఇస్కుల్లనే మొదలు జేస్తే రెండుచునక్‌ ఇంకా మూడు నేరస్థునం అట్లుండాలే. అంకున గాదె మల్ల గొప్పగొప్పోల్లు రాసిన నేను సద్వితే కదా గొప్పతనం ఏర్కయ్యేది గాదె సద్వంటే సద్వునిచె తల్లి సారప్తిటీ దయ అందర్మీద కుర్వలే మొన్న శుక్రరం సిపంచమి అయ్యగారు చెప్పి అయ్తే ముందు దినమే అందర్కి చెప్పేసిన అందరు పల్కలు బలపలు అన్నీ పాటకొచ్చి జామ చేసిండ్రు అంత సిబ్రం గా ఊడ్చి ముగ్గులు పెట్టి తెల్లగా మేజబల్ల పైనా తేళ్లబట్ట పడ్సినం సరస్పతి పోటు పసుపుకుంకుమా, తెల్ల గండం సబ్రాణి, అర్తిపళ్లు, తెల్ల నువ్వులు, అన్నీ జామ చేస్కోని.

తేళ్ల పూలని ఏరేరి తేచుండ్రు ఆయమ్మకి తెల్పబ్తె ఇష్టమంటని అయ్యగారు సెప్పిండ్రు, పూజ గిత్త జేసి నాయివెడ్డెం ఎక్కుంచి పల్కలకు పూజ చేసినం ఏమైనా, తెల్గుల ఇండి ల అన్నీ అచ్చినై. ఆరం గా కూసోని సద్వుడేనాయె వచ్చేరు ఏటి కల్ల పోస్టుకలు సద్వి జలతిమంటే ఇంకా మా పైనే అమ్మ దయుంంటే, అల్సెంగా నయిన కండ్లు తేర్సినం ,ఇగ మద్యల మానొద్దు అని అందరం సెప్కున్నాం
ఏడిదాక ఒచింది రా మీ తయ్యని లేసి నుంచొని సూడకుండా రేపు ఎట్ల ఇస్పీచ్చేస్తారో సూస్కొండి ఇస్పీచ్‌ కొరకే కాదు గి దినం డెంకు ముఖ్యమో జెండా ఎంత ఎగిరెయ్యల్నో ఎవరెవరు ఎట్ల కోశిష్లు చేసిండ్రో మన్సులు పట్టించుకొని ఇంకా ముందు ముందు జెండా ఇల్వ నిబాయింవుడు మా వంతని నిర్ణయించుకోవాలే గిప్పుడు కాకున్న కొన్నేండ్లకైనా ఓటేస్తారు కదా ఓటంటే నోటుకు కోమెడి కాదు ఓటేసుడు నాయకుణ్ణి ఎన్నుకోనికే.
నాయకుడు కావలని కలలుకనొద్దు మంచి జెనం లెక్క గాదె పౌవడంతకద ఉండదే ముక్యం ,పౌరుడు మంచిగుండకుంటె దేశం గతి గంటంతనే గాడి తెల్సుకొని ఇస్పీచూలియ్యింద్రీ, ఇంకా ముందు కట్లనే చేతల్‌ సుపుండ్రి… ఏమంటున్నా?

– గంగరాజ పద్మజ, 9247751121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -