Saturday, March 28, 2026
E-PAPER
Homeఖమ్మంసంపూర్ణ ఆరోగ్యవంతుడే అసలైన ధనవంతుడు

సంపూర్ణ ఆరోగ్యవంతుడే అసలైన ధనవంతుడు

- Advertisement -

గడ్డి మందు ను వెంటనే ప్రభుత్వం నిషేదించాలి 
శ్రీ రక్షా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వరరావు 
నవతెలంగాణ – బోనకల్ 

ఒకప్పుడు కోట్లాది రూపాయల ఉంటే ధనవంతులని నేడు పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటమే నిజమైన ధనవంతులని ఖమ్మం కు చెందిన ప్రముఖ శ్రీరక్ష హాస్పిటల్ యజమాని ప్రముఖ డాక్టర్ గోంగూర వెంకటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని రావినూతల గ్రామంలో శ్రీ రక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఆరోగ్య యాత్ర నిర్వహించారు. తొలుత రావినూతల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ఆరోగ్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు గోంగూర వెంకటేశ్వరరావు ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్, లివర్, కిడ్నీ వ్యాధులు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు.

ఈ నాలుగు రోగాల పట్ల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. నేడు ఆరోగ్యానికి ఉన్నంత విలువ డబ్బుకు లేదన్నారు. కానీ కొంతమంది డబ్బే ప్రదానం అనుకుంటున్నారని, కోట్లాది రూపాయల ఉన్నవారు కూడా రోగాల బారిన పడి మృతి చెందుతున్నారన్నారు. డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చనే భావన సరైంది కాదన్నారు. రోగాలు రాకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అవి ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగించే గడ్డి మందును ప్రభుత్వం వెంటనే నిషేధం విధించాలని ఆయన కోరారు. కుటుంబాలలో కలతలు వచ్చిన సమయంలో కొంతమంది క్షణికావేశంతో ఈ గడ్డి మందు తాగుతున్నారని తెలిపారు.

ఎక్కువగా ఆసుపత్రులకు వచ్చేవారు ఈ గడ్డి మందు తాగిన వారే వస్తుండటం విశేషం. అందువల్ల ప్రభుత్వం మానవజాతికి అత్యంత ప్రమాదకరంగా మారిన గడ్డి మందును నిషేధించాలని ఆయన కోరారు. ప్రజలలో ఆరోగ్య పై చైతన్యం కలిగించేందుకే శ్రీ రక్షా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సుయక్ష హాస్పిటల్ సీనియర్ డాక్టర్ ఏడుకొండలు మాట్లాడుతూ నేడు ఆరోగ్యమే మహాభాగ్యంగా మారిపోయింది అన్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ భూక్య బద్రు నాయక్ ఉపసర్పంచ్ దొండపాడు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు సిపిఎం మండల కమిటీ సభ్యులు గుగులోత్ నరేష్, బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, బిజెపి జిల్లా నాయకులు తాళ్లూరి సురేష్, తెలంగాణ రైతు సంఘం మండల నాయకులు జోనిబోయిన గురవయ్య, కాంగ్రెస్ నాయకులు బిపి నాయక్, శ్రీ రక్ష హాస్పిటల్ వైద్యులు సాత్విక్, అఖిలేష్, ల్యాబ్ టెక్నీషియన్లు తరుణ్, కిరణ్ సిబ్బంది పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -