పూర్ణ ప్రధాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్’. ఈనెల 13న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో రిలీజ్ కానుంది. జి.ఆర్.ఆదిత్య ఈ చిత్రానికి కథ అందివ్వడంతోపాటు దర్శకత్వం వహించారు. హేమ పాత్రలో పూర్ణ నటించి కథకు కీలకంగా నిలిచే పాత్రను పోషించారు. ఆమెతో పాటు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రోషన్‌గా, విధార్థ్ అలెక్స్‌గా, సుభాశ్రీ రాయగురు సోఫియా పాత్రలో నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఆదిత్య. సంగీత దర్శకుడు మిస్కిన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి, ‘నాలుగు ప్రధాన పాత్రల జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది. వారి మధ్య ఉన్న సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి.
కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులు భావోద్వేగాలతో నిండిన ప్రయాణాన్ని అనుభవిస్తారు. ఈ చిత్రంలో అతీంద్రియ అంశాలతో కూడిన ఒక ఊహించని ట్విస్ట్ కథను కొత్త మలుపు తిప్పుతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. మిస్కిన్ ప్రత్యేకమైన సిగ్నేచర్ మ్యూజిక్ ఈ చిత్రం భావోద్వేగం, సస్పెన్స్‌ల సమ్మేళనంగా నిలుస్తూ మరపురాని సినిమాటిక్ అనుభవంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తానికి కథ చెప్పే విధానం, భావోద్వేగాలు, ఉత్కంఠతో కూడిన అంశాలతో ప్రేక్షకులను ఎమోషనల్ థ్రిల్ ఇస్తూ రెండు గంటలపాటు ఉత్కంటభరితంగా పాత్రలతో మమేకం చేస్తుంది. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్‌లో ఉన్న యూత్‌కు సంబంధించిన అంశాలు హైలెట్‌గా వారి అనుభవాలను ప్రతిబింబిస్తాయి’ అని అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు : శ్రీనివాస్ మేదరమెట్ల, జె. కొండలరావు, మ్యూజిక్ డైరెక్టర్: మిస్కిన్, డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : కార్తీక్ ముత్తు కుమార్, ఎడిటర్ : ఇళయరాజా ఎస్, ఆర్ట్ డైరెక్టర్:అంటోనీ మరియా కేర్లి.
ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేసే ట్విస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



