హీరో హవిష్, దర్శకుడు త్రినాథ రావు నక్కిన కలయికలో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా బ్యానర్‌పై నిఖిల కొనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. చిత్ర బృందం క్రిస్మస్ సందర్భంగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. నవ్వులు పూయించే వినోదాత్మక చిత్రాలను అందించడంలో పేరొందిన దర్శకుడు త్రినాథ రావు నక్కిన.. హవిష్‌ను మల్టీ లేయర్స్ ఉన్న హ్యుమర్ రోల్‌లో చూపిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో సుదీర్ఘ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత, చిత్ర బృందం గురువారంతో పాండిచ్చేరిలో హీరో హీరోయిన్ల పై ఓ సాంగ్ షూట్‌ని పూర్తి చేసింది.
‘ఈ పాటకు విజయ్ పోలాకి కొరియోగ్రఫీ చేశారు. సాంగ్ అద్భుతంగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘నేను రెడీ’ టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన స్పందనను పొంది, సినిమాపై అంచనాలను పెంచింది’ అని చిత్ర బృందం తెలిపింది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్ నటిస్తున్న ఈచిత్రానికి డీఓపీ : నిజార్ షఫీ, సంగీతం: మిక్కీ జె మేయర్, కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, యాక్షన్: రామకృష్ణ.
పక్కా కమర్షియల్ సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



