Wednesday, October 1, 2025
E-PAPER
Homeసినిమాఅలరించే యూనిక్‌ లవ్‌స్టోరీ

అలరించే యూనిక్‌ లవ్‌స్టోరీ

- Advertisement -

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా ప్రస్తుతం తన 41వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో రవి నేలకుదిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది వారి నిర్మాణంలో వస్తున్న 10వ చిత్రం.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేను మేకర్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. దర్శకుడు ఒక హార్ట్‌ వార్మింగ్‌ యూనిక్‌ ప్రేమకథను రాశారు. గ్రాండ్‌ పాన్‌-ఇండియా మూవీగా రెడీ అవుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో థియేటర్లలోకి రానుంది అని చిత్ర బృందం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -