హీరో విజయ్ ఆంటోనీ నటించిన కొత్త సినిమా ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి ఈనెల 19న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ,’అరుణ్ ప్రభు లాంటి డైరెక్టర్‌తో వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. కచ్చితంగా ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. నిర్మాత రామ్ నాకు మంచి స్నేహితులు. వారితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నా. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ సురేష్‌బాబుకి హదయపూర్వక కతజ్ఞతలు’ అని తెలిపారు. ‘ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. విజయ్ ఆంటోనీ మల్టీ టాస్కింగ్‌ని చాలా అద్భుతంగా చేస్తూ మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నారు’ అని నిర్మాత సురేష్ బాబు చెప్పారు.
డైరెక్టర్ అరుణ్ ప్రభువు మాట్లాడుతూ,’ఈ సినిమా మీ అందరి అంచనాల్ని అందుకుంటుంది. ఇది మంచి పొలిటికల్ థ్రిల్లర్. ఇది ఏ రాష్ట్రానికో, దేశానికో సంబంధించిన పాలిటిక్స్ కాదు. ఇది పీపుల్ పాలిటిక్స్. అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది’ అని అన్నారు. ‘విజయ్ డెడికేషన్, హార్డ్ వర్క్‌తో ఈ సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్‌కి చాలా బాగా నచ్చుతుంది. విజయ్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేకంగా ఉంటుంది. డైరెక్టర్ అరుణ్ సమాజంలో చాలా కీలకమైన అంశాలను వినోదాత్మకంగానే కాకుండా సందేశాత్మకంగా కూడా డీల్ చేశారు. సురేష్‌బాబు మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు. వారి డిస్ట్రిబ్యూషన్ ద్వారా మేం రిలీజ్ చేసిన ‘మార్గన్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో, అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఇదొక యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్. ప్రతి ఒక్కరికీ బాగా కనెక్ట్ అవుతుంది’ నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ చెప్పారు.
అందరికీ కనెక్ట్ అయ్యే యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -