Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఆలోచింపజేసే 'యూనివర్శిటీ' : త్రివిక్రమ్‌

ఆలోచింపజేసే ‘యూనివర్శిటీ’ : త్రివిక్రమ్‌

- Advertisement -

‘ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి, ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది. ఆ గొంతు అందరికీ వినపడాలి. అది మనకి నచ్చ వచ్చు, నచ్చకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లా డాల్సిన అవసరం ఉంది. అది మనం వినాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమీ జరుగుతుంది అంటే ప్రపంచంలో ఏక పక్ష ధోరణి రావడం వలన రాబోయే జనరేషన్స్‌ చాలా సంకుచితంగా తయారైపోతారు. అందుకని విభిన్నమైన గొంతుకలు విభిన్నమైన అభిప్రాయాలు ఉండాలి. అలాంటి ఒక పార్శ్వం, అలాంటి ఒక అందం ఆర్‌ నారాయణ మూర్తి సొంతం’ అని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అన్నారు.
స్నేహ చిత్ర పిక్చర్స్‌ బ్యానర్‌పై ఆర్‌ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూనివర్శిటీ’ (పేపర్‌ లీక్‌). ఈ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రసాద్‌ ల్యాబ్‌లో ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పేపర్‌ లీక్‌లు, విద్యాబోధన ఇంగ్లీషులో జరగాలా?, తెలుగులో జరగాలా?, విద్యార్థులు ఉద్యోగాల కోసం జాబ్‌ క్యాలెండర్స్‌ కోసం వెయిట్‌ చేయడం, అక్కడ కూడా లంచాలు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తుంటే, మిగతా వాళ్ల తాలూకు స్టూడెంట్స్‌ నిస్పహా… ఇలా ఇందులో ఏ అంశం కూడా మనల్ని వెంటనే ఉత్తేజ పరచవు. ఆలోచింపజేసేఅంశాలు, లేకపోతే నిరాశ పరిచే అంశాలు అయినప్పటికీ కూడా సినిమాని బలమైన పట్టుతో నారాయణమూర్తి నడిపించారు. ఈ సినిమాలో గద్దర్‌ పాట నాకు బాగా నచ్చింది. విద్యార్థుల భవిష్యత్‌ కోసం వర్తమానన్ని తాకట్టు పెట్టిన తల్లిదండ్రుల వేదన, పిల్లలపై చదువు ఒత్తిడి ఎలా ఉందనే పాయింట్‌ నాకు బాగా నచ్చింది. ఇదొక విష సంస్కతి అనాలా..?, అసలు మనం దేని వెనకాల పరిగెడుతున్నాం. చదువు వల్ల వచ్చే సక్సెస్‌ వెనకాల లేదా జ్ఞానం వెనకాలా?, జ్ఞానం వెనకాల పరిగెడుతుంటే ఇంత డబ్బులు విసిరేసి పరిగెత్తాలా?. జ్ఞానం మనకు ఆనందాన్ని ఇవ్వాలి. ఇంత నొప్పి ఎందుకొస్తుంది ఇంత బాధ ఎందుకొస్తుంది. మనల్ని కన్న వాళ్ళకి ఎందుకు ఇంత కష్టాన్ని ఇస్తుంది?’ అని అన్నారు.
‘నేను అడిగిన వెంటనే ఒప్పుకొని, నా సినిమా చూసిన దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి ధన్యవాదాలు. సినిమా నచ్చింది అని చెప్పారు సంతోషం. విద్యను ప్రవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి, విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని చాటి చెప్పేదే ఈ చిత్రం. ఈనెల 22న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం’ అని ఆర్‌.నారాయణ మూర్తి చెప్పారు. వైఎస్‌ కష్ణేశ్వర్‌ రావు, తిరుపతి నాయుడు, విజరు కుమార్‌తోపాటు నూతన తారాగణం నటించిన ఈచిత్రానికి పాటలు: గద్దర్‌, జలదంకి సుధాకర్‌, వేల్పుల నారాయణ, మోటపలుకులు రమేష్‌, ఎడిటింగ్‌: మాలిక్‌, కెమెరా : బాబూరావు దాస్‌, కథ-స్క్రీన్‌ ప్లే – మాటలు – సంగీతం – దర్శకత్వం – నిర్మాత: ఆర్‌. నారాయణ మూర్తి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img