Tuesday, February 17, 2026
E-PAPER
Homeఆటలుఅఫ్గాన్‌కు ఓ విజయం

అఫ్గాన్‌కు ఓ విజయం

- Advertisement -

యుఏఈపై 5 వికెట్లతో గెలుపు

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో గెలుపు వేటలో రెండు సార్లు సూపర్‌ఓవర్‌ ఆడినా అఫ్గనిస్తాన్‌కు నిరాశే ఎదురైనా.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ పోరు రసవత్తరంగా మారింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో సూపర్‌ఎయిట్‌ ఆశలు ఆవిరి చేసుకున్న అఫ్గనిస్తాన్‌ గ్రూప్‌ దశలో తొలి విజయం సాధించింది. సోమవారం ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో యుఏఈపై 5 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ గెలుపొందింది.

తొలుత యుఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులు చేసింది. షోయబ్‌ ఖాన్‌ (68, 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), అలిషాన్‌ (40, 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అఫ్గనిస్తాన్‌ బౌలర్‌ అజ్మతుల్ల (4/15), ముజీబ్‌ (2/31) కీలక వికెట్లు పడగొట్టారు. ఊరించే లక్ష్యాన్ని అఫ్గనిస్తాన్‌ 19.2 ఓవర్లలో ఛేదించింది. ఇబ్రహీం (53, 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), అజ్మతుల్ల (40 నాటౌట్‌, 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా ఆ జట్టు 162/5 పరుగులు చేసింది. అజ్మతుల్ల ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -