నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని సరిహద్దు గ్రామమైన చెండేగావ్ లో 99రోజల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జపి సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మన్ అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామ్ పటేల్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని గ్రామసభలో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల సహకారం ఎలా ఉందని గ్రామ అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని అన్నారు. గ్రామానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలంటే గ్రామంలో ముఖ్యంగా గుడికి కాలువల నిర్మాణాలు , సీసీ రోడ్లు పేదలకు ఇందిరమ్మ గృహ నిర్మాణాలు, పెన్షన్లు రైతుబంధు రవంతి ప్రజలకు చేరుతున్నాయా లేదా అని వాటి గురించి ఆరా తీయడం జరిగింది. కొత్త పనులకు నిర్మాణాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, జిపి కార్యదర్శి, ఆర్ఐ గ్రామ పెద్దలు, యువకులు మహిళా సంఘాలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సరిహద్దు గ్రామమైన చండేగావ్ లో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



