- Advertisement -
నవతెలంగాణ – బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవారుకు శుక్రవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవారుతో పాటు సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ పగిడిగంటం నర్సింహాలకు రాష్ట్ర హై కోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజరు పాల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఏజీ సుదర్శన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
- Advertisement -