Monday, December 15, 2025
E-PAPER
Homeజిల్లాలురాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘన స్వాగతం 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘన స్వాగతం 

- Advertisement -

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కే .రామకృష్ణారావు ఆదివారం నాగార్జునసాగర్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొనే నిమిత్తం నాగార్జున సాగర్ వెళుతూ మార్గ మధ్యంలో నల్లగొండ  జిల్లా కేంద్రానికి వచ్చారు. నల్లగొండకు  వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావుకు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధరణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి కోర్రా లక్ష్మి ,రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు ఎండి ,ఐ ఏ ఎస్ అధికారి భవేష్ మిశ్రా, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,పలువురు జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి  పుష్ప గుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. 

 ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గతంలో తాను నల్గొండ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన రోజులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. స్వాగతం పలికిన వారిలో   నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి ,జిల్లా  పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -