Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహమాలీ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి

హమాలీ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి

- Advertisement -

– ములుగులో సీఐటీయూ భారీ ర్యాలీ
– కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ – ములుగు

హమాలీ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ జి.మహేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాకు ముందు ములుగులో డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలైన ఐకేపీ, పీఏసీఎస్‌, జీసీసీల్లో పనిచేస్తున్న బజార్‌ ముఠా హమాలీ, సివిల్‌ సప్లరు హమాలీ.. తదితర హమాలీ కార్మికులందరికీ కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గిగ్‌ వర్కర్ల మాదిరిగా హమాలీ వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు లారీలు లోడ్‌ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు బస్తాలు మీద పడి గాయాలపాలైన, చనిపోయినా ఎలాంటి రక్షణ లేదని అన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, యూనిఫామ్‌ ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లోడ్‌ చేసినంత టైం తాడు కొట్టడానికి సరిపోతుంది కాబట్టి తాడుకట్టుటకు మామూలు ఇప్పించాలని కోరారు. హమాలీలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీలు.. రఘు, చిన్ని, స్వామి, సారయ్య, బాలరాజు, రాములు, శ్రీధర్‌, లక్ష్మణ్‌, రమేష్‌, అనిల్‌, శేఖర్‌, నక్క సదయ్య, అల్లం కుమార్‌, నక్క ఐలయ్య, సుధాకర్‌, లింగయ్య, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -