Friday, October 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఒక సంక్షేమ పథకం.. అనేక విప్లవాత్మక మార్పులకు కారణం

ఒక సంక్షేమ పథకం.. అనేక విప్లవాత్మక మార్పులకు కారణం

- Advertisement -

ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు
ప్రయాణ పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైనదంటూ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ”’కొందరు ఎగతాళి చేసినా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి, ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యింది. ఆ ఒక్క పథకం వల్ల ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 35 నుంచి 60 శాతానికి పెరిగిందనీ, పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే సంఖ్య 31 శాతానికి పెరిగిందనీ, ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని ఆర్టీసీలో పనిచేస్తున్న చెల్లెమ్మలు చెప్పిన వివరాలు నాకు ఎనలేని సంతోషానిచ్చాయి. ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి. పేదవాడి ప్రగతి రథ చక్రం ఇక చరిత్ర పుటల్లోకి జారి పోతుందనే పరిస్థితి. అక్కడ నుండి మొదలైన ప్రయాణం నేడు 200 కోట్ల జీరో టికెట్లతో ఆడబిడ్డలకు సాయం చేసి ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, సిబ్బంది, కార్మికులకు నా శుభాకాంక్షలు. సంస్థ యాజమాన్యానికీ, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నా ప్రత్యేక అభినందనలు. ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.’ అని సీఎం ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -