Wednesday, February 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాకతీయ జూలో తెల్ల పులి మృత్యువాత

కాకతీయ జూలో తెల్ల పులి మృత్యువాత

- Advertisement -

వృద్ధాప్యం, గుండెపోటు కారణం
నవతెలంగాణ – నక్కలగుట్ట

హనుమకొండ జిల్లా హంటర్‌ రోడ్‌లోని కాకతీయ జూలాజికల్‌ పార్క్‌లో మంగళవారం తెల్లపులి మృత్యు వాతపడింది. జూ పార్క్‌ పర్యవేక్షణ అధికారి మయూరి, అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 15 సంవత్సరాల వయస్సు గల శరణ్‌ వైట్‌ టైగర్‌(తెల్ల పులి) వృద్ధాప్యం, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగా ఎన్‌క్లోజర్‌లో మృత్యువాతపడినట్టు తెలిపారు. సాధారణంగా తెల్ల పులుల సగటు జీవితకాలం సుమారు 14ఏండ్లు ఉండగా, కాకతీయ జూ వెటర్నరీ అధికారులు, సిబ్బంది అందించిన మెరుగైన వైద్య సేవలు, శాస్త్రీయ సంరక్షణ విధానాల ఫలితంగా ఈ తెల్ల పులి 15ఏండ్ల వరకు జీవించగలిగిందని అన్నారు. వృద్ధాప్యంతో పాటు రక్తపోటు, గుండె సమస్యలు, మూత్రపిండ వ్యాధులతో రెండు నెలలుగా పులి బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఈ సమయంలో వెటర్నరీ వైద్య బృందం నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించినప్పటికీ, మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతిచెందింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలుపగా చీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌ ఆదేశాలతో నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి, పూర్తి నివేదికను హెడ్‌ ఆఫీస్‌కు పంపనున్నట్టు జూ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -