Monday, July 28, 2025
E-PAPER
Homeసినిమాఅద్భుతమైన ప్రేమకథ

అద్భుతమైన ప్రేమకథ

- Advertisement -

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్‌ స్టోరీ’ అనే సిరీస్‌ ఆగస్ట్‌ 8న నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. అనిల్‌ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కష్ణ బుర్రా రూపొందించారు.
ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ను హీరో, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ట్రైలర్‌ చాలా బాగుంది. ‘మై విలేజ్‌ షో’ టీం డెడికేషన్‌, సంకల్పం అన్నింటి కంటే గొప్పది. ఈ సిరీస్‌ అద్భుతంగా ఉండబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు. ‘తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో అద్భుతమైన ప్రేమ కథగా ఈ సిరీస్‌ రాబోతోంది. ఈ సిరీస్‌ తరువాత మరెన్నో గొప్ప ప్రేమ కథలు వస్తాయి’ అని మధుర శ్రీధర్‌ చెప్పారు. నిర్మాత శ్రీరామ్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ, ”మై విలేజ్‌ షో’ నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాం. ఇది మాకు ఆరంభమే. మున్ముందు మరింత చేయబోతున్నాం. మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన జీ5కి థ్యాంక్స్‌’ అని అన్నారు. ‘ఈ సిరీస్‌ అందరినీ నవ్వించేలా, మెప్పించేలా ఉంటుంది. చరణ్‌ పాటలు, మాటలు ఎప్పుడూ మోటివేట్‌ చేస్తూనే ఉంటాయి’ అని దర్శకుడు శివ కష్ణ బుర్రా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -