శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఓ టార్చర్ ప్రేమ’. ఈ చిత్రం ద్వారా మాదాల రంగారావు మనవడు, మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా, మౌనిక డాకోజు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర మొదటి టైటిల్ పోస్టర్‌ని రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ విడుదల చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మా మాదాల రంగారావు మనవడు, మాదాల రవి కుమారుడు.. మూడోతరం హీరో సన్నీ మాదాల హీరోగా పరిచయం అవుతున్నాడు. తాత, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం హీరో సన్నీ మాదాల ప్రేమ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఓ అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. రచన, దర్శకత్వం అనేది మేము చాలా చిత్రాలకి వహించాం, కానీ దర్శకుడు శ్రీకర్ కృష్ణ మన దాసరి నారాయణ రావు రీతిలో రచన, దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా అందించాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి’ అని అన్నారు.
‘ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం’ అని దర్శకుడు శ్రీకర్ కృష్ణ తెలిపారు.
అద్భుతమైన ప్రేమకథ
- Advertisement -
- Advertisement -



