Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాయదుర్గంలో గజం రూ.3.40 లక్షలు

రాయదుర్గంలో గజం రూ.3.40 లక్షలు

- Advertisement -

ఎకరం భూమిని వేలం వేసిన టీజీఐఐసీ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని బొటిక్‌ మిక్సెడ్‌ యూజ్‌ ప్లాట్‌ను తెలంగాణ స్టేట్‌ ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) వేలం వేసింది. సోమవారం జరిగిన వేలంలో చదరపు గజం రూ.3.40 లక్షలు ధర పలికినట్టు టీజీఐఐసీ తెలిపింది. సుమారు ఒక ఎకరం భూమిని వేలం వేశామని పేర్కొన్నారు. 2017లో చదరపు గజం రూ.88 వేలు ఉండగా, ఈ సారి రికార్డు స్థాయిలో రూ.3.40 లక్షల ధర పలికింది. ఈ సందర్భంగా టీజీఐఐసీ వీసీఎమ్‌డీ కే శశాంక్‌ మాట్లాడుతూ ప్రస్తుత వేలం ద్వారా హైదరాబాద్‌లో భూముల ధరలకు మరింత ఊపు వస్తుందని భావిస్తున్నామన్నారు. నగరంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న, అధిక రాబడినిచ్చే వ్యాపార కారిడార్‌లో ప్రధానమైన స్థలాలను దక్కించుకోవడానికి డెవలపర్లు వ్యూహాత్మకంగా ప్రీమియం చెల్లించి పెట్టుబడి పెడుతున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -