Wednesday, October 1, 2025
E-PAPER
Homeజిల్లాలుMPDO: గ్రూప్ 1లో మెరిసిన కల్లెడ యువతి

MPDO: గ్రూప్ 1లో మెరిసిన కల్లెడ యువతి

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్

ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన ఏండి తహేర బేగం తొలి ప్రయత్నంలోనే గ్రూప్ 1లో ఎంపీడీఓ పోస్ట్ ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో10వ తరగతి వరుకు చదివిన ఆమె మండల టాపర్ గా నిలిచారు. అనంతరం బాసర ట్రిబుల్ ఐటీలో సిటు సాధించి బిటెక్ పూర్తి చేశారు. ఆమె తల్లి సహజ్ బేగం బీడీలు చుడుతుంది. తండ్రి ఏండి సలీం అనారోగ్యంతో బాదపడుతున్నారు. ఏండి తహేర బేగం తొలుత బ్యాంక్ ఉద్యోగాన్ని సాధించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో క్లర్క్ ఉద్యోగం చేస్తూ గ్రూప్ 4 పరీక్షలు రాసి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందారు. అక్కడ ఉద్యోగం చేస్తూనే గ్రూప్ 1లో ఎంపీడీఓగా ఉద్యోగం సాధించారు. ఈ ఉద్యోగం రావడంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -