Wednesday, July 16, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కాంగ్రెస్ లో రాణిస్తున్న యువ నాయకుడు..

కాంగ్రెస్ లో రాణిస్తున్న యువ నాయకుడు..

- Advertisement -

గ్రామంలో అభివృద్ధి పనులకు పెద్ద పీట..
నవతెలంగాణ – ముధోల్
: ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు రావుల శ్రీనివాస్ కాంగ్రెస్ అభివృద్ధి పనుల్లో దూసుకేళ్తుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో మండలంలోని ఆయా గ్రామాల్లో సిసి రోడ్లు, బోర్లు మోటార్, పైప్ లైన్, మురికి కాలువల పనులు చెప్పట్టారు. మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, వేణుగోపాల్ చారి సహాయంతో  అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క వివిధ అభివృద్ధి పనుల కోసం  సుమారు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది.

దీంతో యువ నాయకుడు రావుల శ్రీనివాస్ మండలంలోని ఆష్ట, ఎడ్ బిడ్, తరోడతో పాటు ఆయా గ్రామాల్లో సిసి రోడ్లు, మురికి కాలువల పనులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు కావటంతో, సకాలంలో పనులు చేసి పలువురు మన్ననలు పొందారు. అలాగే ఎసిడిపి నిధులు రూ.26 లక్షలతో బోర్, మోటార్, పైప్ లైన్ పనులు కోసం మంజూరు కావటంతో పనులు కూడా  చెపట్టారు. నిత్యం తన గ్రామంలో తన దగ్గర కు వచ్చిన వారికి వివిధ పనుల్లో అండగా ఉంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా యువ నాయకుడు రావుల శ్రీనివాస్ మంగళవారం నవతెలంగాణతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో  అవకాశం వస్తే ముధోల్ మండలానికి జడ్పిటిసి గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తానని ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాని ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -